హృతిక్ రోషన్ రేంజ్ ఇంతేనా??
బాలీవుడ్ లో జోధా అక్బర్ లాంటి సినిమాను ఎవరు మరిచిపోగలరు? ఆ సినిమాలో హృతిక్ రోషన్ నటన - అశుతోష్ గోవారికర్ డైరెక్షన్ ప్రతిభ కలిసి అది ఒక బ్లాక్ బస్టర్ గా మిగిలింది. అదే కాంబినేషన్ లో రాబోయే సినిమా అంటే జనాల్లో మామూలు క్రేజ్ ఉండదు. ఆ సినిమా ఎప్పుడొస్తుందా.. ఏ స్థాయిలో ఉంటుందా.. అనే ఆలోచనలతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. దీంతో.. వీరిద్ధరి కాంబినేషన్ లో వచ్చే మొహంజొదారో సినిమా కు ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తాయని ఇండస్ట్రీ జనాలు కూడా భావించారు.
అయితే ఊహించుకున్నదానికి పూర్తి వ్యతిరేకంగా మొహంజొదారో పరిస్థితి ఉంది. అసలు హృతిక్ సినిమా వస్తున్న సమయంలో అక్షయ్ కుమార్ రుస్తుం సినిమా నిలవదని భావించారు. తీరా చూస్తే.. రుస్తుం దెబ్బకే మొహంజొదారో కోలుకోలేని పరిస్థితికి వెళ్లిపోయిందని సమాచారం. హృతిక్ సినిమా అంటే తొలిరోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయి. అది హిట్టు సినిమా అయినా.. ఫట్టు సినిమా అయినా తొలిరోజు కలెక్షన్స్ భారీగా వస్తాయి. కానీ.. మొహంజొదారో మాత్రం తొలిరోజు కేవలం 8.86 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
తెలుగు సినిమాలే రిలీజ్ రోజు సుమారు 20 కోట్లవరకూ వసూళ్లు సాధిస్తుంటే.. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో సినిమా కేవలం 8 - 9 కోట్ల మధ్య వసూలు చేయడం దారుణమనే చెపాలి. ఈ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ని చూస్తుంటే.. మొహంజొదారో ఏ స్థాయి డిజాస్టరో అర్థమైపోతుందనే చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అశుతోషే నిర్మాతగా కూడా మారి దీనిపై 150 కోట్ల బడ్జెట్ పెట్టాడు. అయితే తాజా పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈ సినిమా తిప్పి తిప్పి కొట్టినా 70 కోట్లు కూడా వసూలు చేయదని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ స్థాయిలో కలెక్షన్స్ పడిపోవడం.. అటు హృతిక్ కి ఇటు అశుతోష్ కి కూడా ఫుల్ డిజప్పాయింట్ మెంట్ అనే చెప్పాలి!
papam Hrithik.......
ReplyDeletebrilliant analysis
ReplyDelete