Sunday, 14 August 2016

BABU BANGARAM Review

బాబు బంగారం రివ్యూ: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో!!!
రేటింగ్: 1.75/5

భలే భలే మగాడివోయ్ సినిమా చూసి మారుతి చాలా మారాడని అనుకున్నాం.. అయితే బాబు బంగారం సినిమాతో కమర్షియల్ ఎంటెప్ట్ చేసి దారుణంగా ఫెయిలయ్యాడు. కథలో కాదు కదా కథనంలో కూడా మారుతి మార్క్ కనిపించలేదు. ఏదో తీశామంటే తీశామని అభిమానులను ఉసూరుమనిపించాడు. ఆగడు సినిమాకే పార్ట్-2 చూపించాడు.
ఇక కథలోకి వెళ్తే ఏసీపీ కృష్ణ (వెంకీ)ది చాలా జాలిగల మనస్తత్వం. తాత నుంచి సంక్రమించిన జాలిగుణంతో పోలీస్ అయినా రౌడీలపై జాలి కురిపిస్తూ ఉంటాడు. తనలాంటి మనస్తత్వమే ఉన్న శైలజ(నయనతార)ని తొలిచూపులో ప్రేమిస్తాడు. బత్తాయి బాబ్జీ సహకారంతో శైలజకు పరిచియమై.. ఆమె కుటుంబాన్ని బుట్టలో వేస్తాడు. అయితే శైలు కుటుంబాన్ని కృష్ణ బుట్టలో పడేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది.. అది ఏంటి.. దాని తర్వాత శైలజ కృష్ణకి దగ్గరైందా లేదా అనేదే తర్వాత కథ.
మారుతి పాత కథనే అటు తిప్పి.. ఇటు తిప్పి.. బాబు బంగారాన్ని తీశాడు. అయితే కామెడీ పండకపోవడంతోనే అసలు సమస్య వచ్చింది. వెంకీ లాంటి హీరోని పెట్టుకుని వినోదాత్మక సన్నివేశాలు సరైన రీతిలో రాసుకోకపోవడం మారుతి తప్పే.
కథ అంతా కూడా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లే ఉంది. హీరోయిన్ సమస్యను హీరో టేకప్ చేయాలంటే ఆ ఎమోషన్ ను ముందు ప్రేక్షకుడు ఫీలవ్వాలి. అసలు హీరో హీరోయిన్ల మధ్య బంధం పెరగడానికి సరైన కారణాలే కనిపించవు. నయనతార మేకప్ అసలు బాగోలేదు. బ్రహ్మానందం కామెడీ పేలలేదు. ఉన్నంతలో పృథ్వీ కామెడీ బెటర్.
సాంకేతిక విభాగంలోమ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సిగ్నేచర్ పాటలు ఇవ్వలేకపోవడం మైనస్. మారుతి ఇంతకుముందు సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. ఇక రచయితగా, దర్శకుడిగా మారుతి దారుణంగా ఫెయిలయ్యాడు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం బాగుంది. క్లైమాక్స్ మొత్తం బొబ్బిలిరాజా నేపథ్య సంగీతంతో నింపేశారు. ఫస్టాఫ్ ఒక మాదిరిగా ఉంది కానీ.. సెకండాఫ్ చాలా బోరింగ్ గా ఉంది.
కొసమెరుపు: ఆగడు సినిమానే డిజాస్టర్ అనుకుంటే ఇంచుమించు ఆగడు లాంటి కథనే పోలిఉన్న బాబు బంగారం అంతకంటే ఎక్కువగా విసిగించడం మింగుడుపడని విషయం.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: శ్రీరాములు, మూసాపేట

1 comment:

  1. Truely said..... idemi bangaram anipinchindi..

    ReplyDelete