Saturday, 13 August 2016

Brahmotsavam Review

బ్రహ్మోత్సవం రివ్యూ: ఆల్ "బోరింగ్'' ఉత్సవం..
రేటింగ్: 1.75/5


తెలుగులో ఇప్పటికే చాలా ఫ్యామిలీ మూవీస్ వచ్చాయి. కానీ అవి ఏదో ఒక సందర్భంలో మనల్ని, మన గుండెలను తట్టి కళ్లు చెమరుస్తాయి. కానీ బ్రహ్మోత్సవం అనే బ్రహ్మాండమైన టైటిల్ పెట్టి మన గుండెలు బాదులుకునేలా తీయడం ఒక్క శ్రీకాంత్ అడ్డాలకే సాధ్యమైంది ఏమో!!!. ఈ చిత్రం అంతలా ఆడియన్స్ సహనాన్ని టెస్ట్ చేసింది. సినిమాలో ఒక్కటంటే ఒక్క మలుపుంటే ఒట్టు. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో సదరు డైరెక్టర్. నిర్మాత, హీరోలకన్నా తెలుసో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక.
కథగా చెప్పాల్సి వస్తే అందరూ కలిసి ఉంటేనే బ్రహ్మోత్సవం అనుకునే ఓ ఫ్యామిలీ... రోజూ ఆటలు.. పాటలు. హీరో గారేమో మమాకేసి చూస్తూ ఉండటం.. మామ హీరో తండ్రి మీద గుర్రుగా ఉండటం.. ఒకరోజు మామగారి వల్ల హీరో తండ్రి చనిపోవడం.. తరువాత హీరోగారు దేశాలు పట్టుకుని తిరగడం.. చివరలో మామ హృదయం కరిగేలా డైలాగులు చెప్పడం.. మధ్యలో హీరోయిన్ లతో రొమాన్స్ కూడా ఉందండోయ్.
అసలు ఈ సినిమాలో మహేష్ ఫ్యామిలీ అంతా ఎందుకు ఆడుతున్నారో.. ఎందుకు పాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి. దేనికంటూ ఒక రీజన్ ఉండాలిగా.. ఇక సినిమాలో హీరోగారి తండ్రి చనిపోతే ఆ ఫ్యామిలీలో ఎమోషన్స్ రావాలిగా. ఆ సందర్భాన్నే దర్శకుడు మరిచిపోయాడు. తెరనిండా క్యారెక్టర్లు ఉన్నా ఏం లాభం. ఆడియన్స్ కు నిస్సత్తువ ఆవహించేలా కథనం ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం?. పోనీ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.. వారికంటూ ఒక బేసిక్స్, క్యారక్టర్ ఉన్నాయా అంటే అదీ కరువే.
ఫస్టాఫ్ లో సాంగ్స్ వచ్చి అలా పోతుంటాయ్. పాటలు వినడానికి బాగున్నా మరీ విసుగు వచ్చేలా పాటల సందర్భాలు ఉన్నాయి. బాలా త్రిపురమణి సాంగ్ లో అయితే మహేష్ డ్యాన్స్ చూస్తే నవ్వు రావడం ఖాయం.సినిమా చూడటానికి రిచ్ గా ఉన్నా కథ ,కథనాలు మరీ పరమ బోర్ కొట్టించాయి. పోనీ హీరోయిన్లు బాగున్నారా అంటే కాజల్, సమంత ఫేడ్ అవుట్ అయినట్లు కనిపించారు. సమంత అలా వాగుతుంటే మనకు ఇరిటేషన్ రావడం ఖాయం.
మహేష్ సినిమా ఫ్యామిలీ సినిమా తీశాడులే అనుకుంటే.. ఒక మురారి, అతడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లా ఉంటాయని ఆశపడ్డ అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ తీవ్ర నిరాశ చెందారు. సినిమా సినిమాకు దిగజారుతున్న శ్రీకాంత్ అడ్డాలను ఎవరికైనా చూపించండిరా బాబు.. (svscలో రావురమేష్ డైలాగ్). భారీ కాస్టింగ్ తో సినిమా ఎలా తీయాలో కృష్ణవంశీని చూసి నేర్చుకో బాబూ. ఇప్పటికీ ఇక ఈ సినిమా చూడాలనుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: ముక్తా రామకృష్ణ (అబిడ్స్)

No comments:

Post a Comment