కబాలి రివ్యూ: మరో బాషా.. అంత సీన్ లేదు...!!!
రేటింగ్: 2.5/5
ముందుగా ఒక విషయం.. కబాలిని టాలీవుడ్ టాప్ మూవీ బాహుబలితో పోల్చినప్పుడు ఔరా అనిపించింది.. కానీ సినిమా చూశాక.. ఈ సినిమా బాహుబలి అంచులను తాకే సినిమా కూడా కాదని ప్రూవ్ అయింది.. ఇక కబాలి కథ విషయానికి వస్తే మరో బాషా అవుతుందని అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కేవలం రజనీ స్టైలింగ్ లో తప్ప ఈ సినిమా ఎమోషన్ లెస్ స్టోరీగానే మిగిలింది.
కబాలి కథ దగ్గరికి వస్తే.. మలేషియాలో 25 ఏళ్లు జైలు జీవితం గడిపిన అనంతరం కబాలిని విడుదల చేసే విషయంలో ఆ ప్రభుత్వం సంకోచిస్తుంది. కబాలి బయటకు వస్తే మళ్లీ గ్యాంగ్ స్టర్ వార్స్ జరుగుతాయో అన్న అనుమానాలతో మదనపడుతుంది. కానీ వయసు మళ్లిన వ్యక్తి ఏమీ చేయలేడని నిర్ణయానికి వచ్చి కబాలిని విడుదల చేస్తారు. 25 ఏళ్ల ముందు మలేషియాలో భారతీయులు ఎలా కష్టాలు పడ్డారో.. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఏమీ మారకపోవడంతో కబాలి మలేషియన్ గ్యాంగ్ స్టర్ లను ఎలా అంతమొందించాడన్నదే కథ.
ఈ సినిమాకు రజనీకాంతే కర్త, కర్మ, క్రియ.. వయసు మళ్లిన డాన్ గా రజనీ స్టైలింగ్ అదరగొట్టాడు. డాన్ స్టోరీ కాబట్టి ఎంటర్ టైన్ మెంట్ ఆశించడం తప్పు. అయితే సీరియస్ కథలో పండాల్సింది ఎమోషన్. ఇక్కడే కబాలి గాడి తప్పాడు. ఇప్పటికే అరిగిపోయిన కథలను మలేషియా తీసుకెళ్లి చూపించారు. అది తప్ప కబాలి స్టోరీలో కొత్తదనమేమీ లేదు. మలేషియాలో భారతీయుల కష్టాలను మాత్రమే కొంచెం బాగా క్యాప్చర్ చేయగలిగారు. దర్శకుడు పా.రంజిత్ కథనంలో కొంచెం వైవిధ్యం చూపిస్తే బాగుండేది. ఈ డాన్ సినిమాలో డ్యూయట్ పాటలేవీ లేవు. కేవలం రెండు బ్యాక్ గ్రౌండ్ పాటలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మనకు ఎక్కవనుకోండి. కబాలి అన్న మ్యూజిక్ తప్ప సినిమాలో సంతోష్ నారాయణన్ సంగీత ప్రతిభ శూన్యం. ఫొటోగ్రఫీ రిచ్ గా ఉంది.
రజనీకాంత్, రాధికాఆప్టే, నాజర్, వీరశంకర్ గా వేసిన వ్యక్తి తప్ప తెలుగు వారికి తెలిసిన నటులెవ్వరూ లేకపోవడం, కథనం చాలా నెమ్మదిగా సాగడంతో కబాలి నరకంగా సాగుతుంది. తమిళం సంగతి అటుంచితే.. తెలుగులో ఇప్పటికే డాన్ సినిమాలు చాలా వచ్చాయి. అరవం నుంచి వచ్చిన మరో డాన్ సినిమాను తట్టుకోవడం తెలుగువారికి కష్టమే.
కొసమెరుపు: మలేషియాలో గ్యాంగ్ స్టర్లు ఇలా గొడవపడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మనకు అంతుబట్టదు. ఇండియా అంటే పెద్ద దేశం కాబట్టి లాజిక్ ఉండదు. మలేషియాలో కూడా అంతేనా.. హతవిధీ...!!
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: టివోలి -సికింద్రాబాద్
THEATER WATCHED: టివోలి -సికింద్రాబాద్
No comments:
Post a Comment