‘బిగ్‌బాస్’ షో అంటే ఓ ఎంటర్టైన్మెంట్... ఓ ఎమోషన్. సెలబ్రెటీల నుంచి వినోదాలు, ఎమోషన్స్ లాంటివి చూసేందుకే చాలామంది ఈ షోను చూస్తుంటారు. కానీ బిగ్‌బాస్-4 సీజన్లో ఎమోషన్‌ను నిర్వాహకులు తాడు లేని బొంగరంలా మార్చేశారు. ఎమోషన్ అనేది క్యారెక్టర్‌లోని ఫీల్ నుంచి రావాలి కానీ బలవంతంగా రుద్దకూడదు. బిగ్‌బాస్‌లో మోనాల్ ఏడుపులు ఈ కోవలోకే వస్తాయి. ఆమె నుంచి ఓ ఆట లేదు. ఓ ఎమోషన్ లేదు. ఓ ఎంటర్టైన్మెంట్ లేదు. ప్రతిరోజు ఏడవడం తప్ప.
ఇలాంటి బలవంతపు ఏడుపులను ఏ బిగ్‌బాస్ సీజన్లోనూ ప్రేక్షకులు చూసి ఉండరు. మోనాల్ ఆట బాగోకున్నా నిర్వాహకులు బలవంతంగా ఆమెను హౌస్‌లో ఉంచుతున్నారనేది అక్షర సత్యం. కానీ ప్రతిరోజు గుక్కపట్టకుండా ఆమె ఏడుస్తుండటం ప్రేక్షకులకు చికాకు పుట్టిస్తోంది. మంగళవారం ఎపిసోడ్లో ఆమె ఎందుకు ఎక్కి ఎక్కి ఏడ్చిందో నిర్వాహకులకే తెలియాలి. ఇలాంటి పనుల వల్ల బిగ్‌బాస్ షో రేటింగులు పడిపోవడం ఖాయం. ఈ వారం ఆమె ఎలిమినేషన్ కూడా ఖాయంగానే కనపడుతోంది. మోనాల్ ఏడుపులు లేకుండా ఒక్కరోజు ఎపిసోడ్ కూడా జరగడం లేదు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇకపై బిగ్‌బాస్ షోలలో ఇలాంటి ఏడుపు ఘటనలు లేకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
We are expecting more reviews from you. Please do reviews on all upcoming movies and we expecting daily tollywood updates in single place.
ReplyDeleteYes..
ReplyDelete